calender_icon.png 18 October, 2025 | 5:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మార్నింగ్ వాక్

17-10-2025 12:37:37 PM

సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కొనసాగుతున్న మార్నింగ్ వాక్ కార్యక్రమం 

దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్

దేవరకొండ,విజయక్రాంతి: దేవరకొండ మండలంలోని జటావత్ తండా, కొర్ర తండాలో శుక్రవారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్(Devarakonda MLA Nenavath Balu Naik ) మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలకు నేరుగా కలిసి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని అక్కడిక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి వారు కృషి చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవడం, తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా జనహిత ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.