17-10-2025 12:06:24 PM
కర్నాటక: బెంగళూరులోని శ్రీరాంపుర రైల్వే ట్రాక్(Srirampuram railway track) సమీపంలో పట్టపగలు 21 ఏళ్ల కళాశాల విద్యార్థిని హత్యకు గురైన దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. బాధితురాలిని యామిని ప్రియగా గుర్తించారు. ఆమె హోసకెరెహళ్లి ప్రాంతంలోని ఒక కళాశాలలో బి.ఫార్మ్(B Pharmacy student ) చదువుతోంది. ఆమె ఉదయం 7 గంటల ప్రాంతంలో పరీక్ష కోసం ఇంటి నుండి బయలుదేరి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది.
ఆమె మంత్రి మాల్ ప్రాంతం సమీపంలో నడుచుకుంటూ వెళుతుండగా, వెనుక నుండి ఒక యువకుడు ఆమె వద్దకు వచ్చి, పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసి, అక్కడి నుండి పారిపోయాడు. ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో నిందితుడు విగ్నేష్ యామిని కళ్లలో కారంపొడి చల్లి దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటనను చూసిన స్థానికులు వెంటనే శ్రీరాంపుర పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, తనిఖీలు నిర్వహించి, సంఘటన స్థలం నుండి ఆధారాలు సేకరించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.