calender_icon.png 17 October, 2025 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఆర్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు

17-10-2025 12:42:06 PM

చిట్యాల,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం(Chityal Mandal) కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులకు 108 సిబ్బంది సిపిఆర్(CPR)ఫై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినప్పుడు తక్షణం సిపిఆర్ ఎలా చేయాలో వివరాత్మకంగా చేసి చూపించారు. ఒక వ్యక్తి అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడం, గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు ఛాతిపై గట్టిగా నొక్కడం ద్వారా అలాగే కృత్రిమ శ్వాస అందించడం ద్వారా మరల గుండె పనిచేసేటట్లుగా చేయొచ్చని తెలిపారు. అలాగే అంబులెన్స్ లో ఉన్నటువంటి అత్యాధునిక పరికరాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 108 అంబులెన్స్ సిబ్బంది టెక్నీషియన్ టి.నగేష్ కుమార్,పైలెట్ రాజు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.