17-10-2025 11:42:16 AM
ఛత్తీస్‌గఢ్: మావోయిస్టు కంచుకోటైన అబూజ్ మడ్(Abuj Mud) ఖాళీ అయింది. ఛత్తీస్‌గఢ్ బస్తర్ జిల్లా జగదల్ పుర్ లో ముఖ్యమంత్రి విష్ణుదేవ్(Chief Minister Vishnu Dev), హోంమంత్రి సమక్షంలో మావోయిస్టు కేంద్ర ఆశన్న(Asanna surrenders) లొంగిపోయాడు. ఆశన్న అసలు పేరు తక్కళ్లపల్లి వాసుదేవరావు(Takkallapalli Vasudeva Rao). ఆశన్న బీజాపూర్ మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడుగా పని చేస్తున్నారు.ఆశన్న స్వస్ధలం ములుగు జిల్లా నర్సింగాపూర్. చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన దాడిలో ఆశన్న కీలక పాత్ర పోషించాడు. ఆశన్నతోపాటు 208 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
లొంగిపోయినవారిలో 98 మంది పురుషులు, 110 మంది మహిళలు ఉన్నారు. మావోయిస్టు ఉద్యమ చరిత్రలో మరో అతిపెద్ద లొంగుబాటు అని అధికారులు పేర్కొన్నారు. మావోయిస్టులు సీఎం విష్ణుదేవ్(CM Vishnu Dev) సమక్షంలో భారీగా తుపాకులు, మారణాయుధాలను పోలీసులకు అప్పగించారు. మావోయిస్టుల దగ్గర నుంచి 153 తొపాకులు,11 గ్రనేడ్ లాంచర్లు, 41 సింగిల్ షాట్ గన్స్, లైట్ మెషీన్ గన్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు జనజీవనస్రవంతిలోకి అడుగుపెట్టారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట ఆయన లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ వైఖరి సరిగా లేదంటూ ఆరోపిస్తూ బుధవారం 60 మంది మావోయిస్టులతో కలిసి మహారాష్ట్ర సీఎం సమక్షంలో గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు.