31 May, 2026 | 1:08 AM

పారా అథ్లెట్ దీప్తి జీవంజీకి ఇంటి స్థలం

31-05-2026 01:08 AM

హనుమకొండ జిల్లా యూనిసిటీలో కేటాయింపు

హైదరాబాద్, మే 30 : పారిస్ 2024 పారాలింపిక్స్‌లో కాంస్యం గెలిచి తెలంగాణ కు గర్వకారణం నిలిచిన పారా అథ్లెట్  దీప్తి జీవంజికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నజరానా ప్రకటించింది. హనుమకొండ జిల్లా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి లో 500 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

మెట్రోపాలిటన్ ఏరియా అం డ్ అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏఅండ్యూడీ) శాఖ జారీ చేసిన జీఓ ఎంఎస్ నెం.150 ప్రకారం, ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల గ్రా మంలోని ‘యూని సిటీ‘ మోడల్ లేఔట్‌లో ఈ స్థలాన్ని కేటాయించనున్నారు. దీప్తి జీవంజి సాధించిన అసాధారణ విజయాన్ని గుర్తిస్తూ ప్రత్యేక కేసుగా సంబంధిత నిబంధనలకు సడలింపు ఇచ్చి ఈ నిర్ణ యం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన జీవంజి దీప్తి, 2024 పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సా ధించింది.