27 July, 2026 | 12:49 AM

ఖమ్మం టీజీసీజీటీఏ ఎన్నిక

27-07-2026 12:18 AM

ఏకగ్రీవమైన సురేందర్‌రెడ్డి ప్యానెల్ 

హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): ఖమ్మం, తెలంగాణ గవర్నమెంట్ కళాశాల గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ (టీజీసీజీటీఏ) ఖమ్మం జిల్లా ఎన్నికలు స్థానిక ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించారు. ఎన్నికలలో డా కే సురేందర్ రెడ్డి ప్యానెల్ తరుపున అధ్యక్షులు డా. పి విజయ్ కుమార్, కార్యదర్శి సూరంపల్లి రాంబాబు, కోశాధికారి డా. ఎస్ శ్యామలాదేవి, ఉపాధ్యక్షులుగా డా. కుక్కల కార్తీక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ ఎన్నికలకు ముఖ్య అతిథులు గా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ గోపి, మాజీ జిల్లా అధ్యక్షులు డా.ఎన్ మాధవరావు హాజరయ్యా. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డా. ఎన్ గోపి మాట్లాడుతూ.. డా. కే సురేందర్ రెడ్డి నాయకత్వంలో కళాశాల అధ్యాప కుల సమస్యలు పరిష్కారం అయ్యాయని ప్ర భుత్వ సహకారంతో జీవో నెంబర్ 21 ద్వారా జూనియర్ కళాశాల సర్వేస్ ను పరిగణలోకి తీసుకొని కెరియర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కి లబ్ధి పొందేలా సురేందర్ రెడ్డి కృషి చేశారని చెప్పారు.

డా. ఎన్ మాధవరావు మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గం అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర నాయకత్వంతో కలిసి పని చేస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఆగస్టు 2న రాష్ట్ర ఎన్నికలలో సురేందర్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ తీర్మానించారు. ఎన్నికల అధికారిగా డి రమేష్ వ్యవహరించారు. డా.కే కిరణ్ కుమార్, డా. పానుగోటి రవికుమార్, డా. వి బ్రహ్మం, డా.బూరుగు శ్రీనివాస్, డా.డి సుజాత, డా. ఐ కిరణ్ కుమార్, పి శ్రీనివాస్, డా.ఎస్ బాబు, డా.పూర్ణచందర్రావు, డా. శ్యాం ప్రసాద్, డా.శ్రీనివాస్ కుమార్, సిహెచ్ మల్లేశం, డాడి అరుణ, డా. శ్రీరామ్ రాకేష్,  రవికుమార్ పాల్గొన్నారు.