శంకర్‌పల్లి- రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి
బీఆర్‌ఎస్ నాయకుల ధర్నా
శంకర్ పల్లి : జూలై 26 ( విజయ క్రాంతి ): శంకర్ పల్లి వికారాబాద్ రోడ్డును మైతాఫ్ ఖాన్ గూడెం గేటు వరకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని మండల టిఆర్‌ఎస్ నాయ కులు ఆదివారం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్ర మం నిర్వహించారు. బి ఆర్ ఎస్ నాయకులను ధర్నా నిర్వహిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు జిల్లాలను కలుపుకొని పోతున్న రహ దారిని ఎన్నో ఏళ్లుగా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని ఆ గ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యల పట్ల తాము ప్రశ్నిస్తే తమ గొంతు నొక్కి వేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక శాసనసభ్యుడు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య గత మూ డు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచి తన సొంత మండలానికి వెళ్లే రోడ్డును కనీస మరమ్మత్తులతో చేపట్టడం లేదని ఆరోపించారు. ఈ రో డ్డు వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా సరిహద్దులలో ఉందని మూడు జిల్లాల ప్రజ లు ఈ ప్రాంతం నుంచి రాకపోకలు సాగిస్తున్నారని పేర్కొన్నారు. రోడ్డు మరమ్మతులు చేపట్టకపోవడంతో ఎంతోమంది అభాగ్యులు రోడ్డు ప్రమాదాల గురై ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికలలో తాము ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టామని.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగడం లేవని అన్నారు.
ప్రతీది మాటలకే పరిమితం అవుతున్నాయని, ఎటువంటి పథకాలను అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం పట్ల వచ్చే ఎన్నికల్లో ప్రజలు సరైన గుణ పటం చెప్తారని వారు ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి,మాజీ ఎంపీపీలు ధర్మన్న గారి గోవర్ధన్ రెడ్డి, మాల చిన నరసింహులు, మండల పార్టీ అధ్యక్షుడు గండిచేర్ల గోవర్ధన్ రెడ్డి. సర్పంచ్ రాఘవేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచులు నరసింహారెడ్డి, మాణిక్య రెడ్డి, మాజీ ఎంపిటిసి యాదగిరి, మాజీ పి ఎస్ సి ఎస్ చైర్మన్ మాణిక్య రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.






