7 July, 2026 | 8:02 PM

Breaking News

గిరిజన తండాల్లో ఘనంగా సీత్ల భవాని పండుగ వేడుకలు   •   మందకృష్ణ బాటలో పునరంకితం అవుదాం   •   ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి   •   రహదారిపై వరి నాట్లు వేస్తూ నిరసన   •   రోడ్డు భద్రత, ఆటో రిక్షాలో ప్రయాణం, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన   •   మృతుడు బొల్లె ప్రశాంత్ కుటుంబానికి స్నేహితుల ఆర్థిక సహాయం   •   జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి   •   బాన్సువాడ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటి   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి: ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   ఐకెపి రుణాలలో తాండూర్ అత్యధిక ఓవర్ డ్యూ   •  

నిరుపేదలందరికీ ఇళ్లు మంజూరు

04-06-2025 12:14 AM
  1. అర్హులైన వారు నిర్మించుకునేందుకు ముందుకు రావాలి 

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ, జూన్ 3 (విజయ క్రాంతి): నిరుపేదలందరికి ఇండ్లు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ, నియోజకవర్గం, వర్ని మండల కేంద్రం లో లోని CCౄ ఫంక్షన్ హాల్ లో వర్ని, చందూర్, మోస్రా, రుద్రుర్ మండలాల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను ఆయన పంపిణీచేశారు.

వర్ని మండలంకు 425 మంది, చందూర్ మండలం కు 94 మంది, మోస్రా మండలంకు 96 మంది, రుద్రూర్ మండలంకు 188 మందికి మొత్తం 803 మంది లబ్ధిదారులకు  ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసి,ఇళ్ల నిర్మాణం పైన అవగాహన కల్పించిన పోచారం శ్రీనివాసరెడ్డి.

ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన వారు ముందుకు వస్తె ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా,  ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.