13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

మెల్లకుంట తండాలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

23-03-2026 09:15 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మెల్లకుంట తండా గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం గృహప్రవేశం గ్రామ సర్పంచ్ బాల్య నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ హాజరై గ్రామస్తులతో కలిసి రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినందుకు స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావుకు,రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

నూతన ఇల్లు నిర్మాణం ఇందిరమ్మ ఇల్లుతో కల నెరవేరిందన్నారు. గతంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణలు ఇంద్రగాంధీ,వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంజూరు కావడం మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇంద్రగాంధీ,వైయస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు జీవితాంతం గుర్తుంచుకుంటారని తెలిపారు.

పేద ప్రజల కోసం ఇంద్ర గాంధీ, వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏవిధంగా పాటుపడ్డారో అదే మాదిరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజల కోసం నిరంతరం పాటుపడుతూ పేద ప్రజలే సంక్షేమంగా భావిస్తున్నారు. అందుకోసమే నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం తెలంగాణ ప్రజలు మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాల్య నాయక్, మాజీ సర్పంచ్ కేస్లీ వాసురం నాయక్, గ్రామ కార్యదర్శి పవిత్ర, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.