23 March, 2026 | 10:36 PM

ఉరుమడ్లలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

23-03-2026 09:12 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండల పరిధిలోని ఉరుమడ్ల గ్రామంలో సోమవారం పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని నిర్వహించారు. పశుగ్రాస రక్షణ మరియు పశువుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పశువులకు టీకాలు వేశారు. ఒకే రోజు మొత్తం 63 గేదెలు, 39 ఆవులకు పశువైద్య సిబ్బంది టీకాలు వేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ సాగర్ల భాను శ్రీ బిక్షం మాట్లాడుతూ...  పశువులకు సోకే ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధిని వివారించేందుకు  ప్రతి రైతు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని కోరారు. పశువుల ఆరోగ్యంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.​ ఈ టీకా కార్యక్రమంలో పశువైద్యాధికారి ఏ ఎస్ డాక్టర్ అమరేందర్, జె.వి.ఓ సైదులు, ఎల్.ఎస్.ఏ  శ్రీనివాస్, పశు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.