2 July, 2026 | 1:11 AM

చికిత్స పొందుతూ గృహిణి మృతి

02-07-2026 12:00 AM

భర్త పరిస్థితి విషమం 

పాపన్నపేట, జూలై 1: పాము కాటుకు గురైన దంపతులు చికిత్స పొందుతూ భార్య మృతి చెందగా భర్త పరిస్థితి విషమం గా ఉన్న సంఘటన బుధవారం టేక్మాల్ మండల పరిధిలోని పాపన్నపేట పోలిస్ స్టేషన్ పరిధిలోని బోడగట్టు గ్రామంలో చోటుచేసుకుంది. పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు.. మల్లయ్య గారి కవిత(35) సంగమేష్ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనాలు ముంగించుకుని ఇంటిలో నిద్రిస్తుండగా భార్యభర్తలు కవిత, సంగమేష్ లకు నల్ల కట్ల పాటు కాటు వేయడంతో కుటుంబీకులకు సూచించడంతో కుటుంబీకులు వెంటనే పామును గుర్తించి కర్రల సహాయంతో అంతమోందించి పాము కాటుకు గురైన ఇరువురిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం భార్య కవిత మృతి చెందగా భర్త సంగమేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిఫినట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ విషయమై మృతురాలు మామ దుర్గయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.