calender_icon.png 5 October, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి నుంచి హౌజింగ్ బోర్డు భూముల అమ్మకం

05-10-2025 12:00:00 AM

-చింతల్‌లో బహిరంగ వేలం ద్వారా విక్రయం

-కేపీహెచ్‌బీ, రావిర్యాల స్థలాలను ఈవేలం ద్వారా...

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)తో పాటు పలు పట్టణ ప్రాంతాల్లోని హౌజింగ్ బోర్డు ఆధీనంలో ఉన్న ఖాళీ ప్లాట్ల విక్రయాలను అక్టోబర్ 6వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. సోమవారం నగరంలోని చింతల్, నిజాంపేట, బాచుపల్లి ప్రాంతంలో ఉన్న 22 రెసిడెన్షియల్ ప్ల్లాట్లను బహిరంగ వేలం ద్వారా అమ్మేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను గత నెల 15న విడుదల చేశారు. చింతల్ ప్రాంతంలో 18 ఎంఐజీ, హెచ్‌ఐజీ ప్లాట్లు.. నిజాంపేట, బాచుపల్లిలో 4 ప్ల్లాట్లకు బహిరంగ వేలం వేయనున్నారు.

కేపీహెచ్‌బీ కాలనీలో కమర్షియల్ ప్లాట్లు..

నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీ ప్రాంతంలో హౌజింగ్ బోర్డు పలు విడతలుగా నిర్వహించిన భూముల అమ్మకంలో ఎకరా భూమి సుమారు రూ. 70 కోట్లకు అమ్మిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేపీహెచ్‌బీ కాలనీలో నాల్గు కమర్షియల్ ప్లాట్లను అక్టోబర్ 7, 8 తేదీల్లో  ఈ్ర ద్వారా విక్రయించనున్నారు. ఫేజ్ 1, 2 పరిధిలో ఉన్న 6,549 చదరపు గజాల స్థలంతోపాటు 2,420 చదరపు గజాలు, 2397 చ.గజాలు, 726 చ.గజాల విస్తీర్ణంలోని ప్ల్లాట్లకు మంగళవారం నాడు ఈవేలం నిర్వహించనున్నారు.

అలాగే నాంపల్లి ప్రాంతంలోని 1,148 చ.గజాల కమర్షియల్ ప్లాట్‌ను కూడా 8తేదీన ఈ ద్వారానే విక్రయిస్తున్నట్టు హౌజింగ్ బోర్డు అధికారులు తెలిపారు. వీటితోపాటు అక్టోబర్ 9, 10 తేదీల్లో చింతల్‌లోని 10890 చ.గజాల కమర్షియల్ స్థలాన్ని, మహేశ్వరం మండలంలోని రావిర్యాలలోని 13,503 చ.గజాలు, 5953 చ.గజాలు, 3630 చ.గజాల ఖాళీ స్థలాలనుకూడా ఈ్ర ద్వారా అమ్మేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవే కాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని హౌజింగ్ ప్లాట్ల విక్రయానికి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిలో సంగారెడ్డి ప్లాట్లు, జోగుళాంబ గద్వాల, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లోనూ ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటికి సంబంధించి నోటిఫికేషన్లు కూడా ఇప్పటికే విడుదల చేశారు. వీటిని రానున్న పది రోజుల్లో విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు.