15 June, 2026 | 8:42 PM

Breaking News

అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •  

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు

04-09-2024 12:24 AM

మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి

ముషీరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జర్నలిస్టుల సమస్యపై ఇప్పటికే అనేకసార్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బొల్లం శ్రీనివాస్‌తో పాటు పలువురు ప్రతినిధులు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డిని కలిసి జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలపై చర్చించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి గ్రేటర్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. తమ సొసైటీ 2008లో ఏర్పడిందని, అప్పటి నుంచి మూడు దఫాలుగా జర్నలిస్టుల నుంచి సభ్యత్వం తీసుకున్నామన్నారు. ప్రస్తుతం సొసైటీలో 1300 మంది సభ్యులున్నారని అధ్యక్షుడు సోమయ్య వివరించారు. వారి వెంట సొసైటీ ప్రతినిధులు యర్రమిల్లి రామారావు, కరుణాకర్, అంజిరెడ్డి, నాగవాణి, టి.శాంతి  ఉన్నారు.