30 August, 2026 | 8:38 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి

23-06-2025 04:34 PM

టీజేయు జనగామ జిల్లా అధ్యక్షుడు భూస రమేష్ యాదవ్..

టీజేయు ప్రధాన కార్యదర్శిగా మంచికట్ల రాజేష్...

జనగామ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో సోమవారం రోజున స్థానిక బతుకమ్మ కుంటలో జనగామ జిల్లా అధ్యక్షుడు భూసా రమేష్(District President Bhusa Ramesh) అధ్యక్షతన తెలంగాణ జర్నలిస్టు యూనియన్ సన్నాక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్ రావు ప్రధాన కార్యదర్శి బింగి స్వామి ఆదేశాల మేరకు  జిల్లా అధ్యక్షుడు భూస రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మంచు కట్ల రాజేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభం రమేష్ యాదవ్ ఉపాధ్యక్షులు దిగోజు సాంబయ్య ప్రచార కార్యదర్శిగా చిలువేరు మహేందర్ సహాయ కార్యదర్శులుగా సాతేరి రాజు ఎండి అప్రోచ్ కోశాధికారిగా చెల్లోజు నవీన్ చారిలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

కార్యక్రమం అనంతరం జనగామ జిల్లా అధ్యక్షుడు రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో కలెక్టర్ ని కలిసి జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని స్థలాలు కలిగి ఉన్న జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లను మొదటి ప్రాధాన్యతగా తీసుకొని వర్కింగ్ జర్నలిస్టులకు కేటాయించాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగింది. దీనిని సానుకూలంగా స్పందించిన జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్(District Collector Rizwan Basha Shaik) మాట్లాడుతూ... జర్నలిస్టు సమస్యలు పరిష్కరించే దిశగా మేము కృషి చేస్తున్నామని వర్కింగ్ జర్నలిస్టులందరికీ సంస్థ న్యాయం కల్పిస్తూ త్వరలోనే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్  జర్నలిస్టులు పాల్గొనడం జరిగింది.