23-06-2025 04:37:11 PM
వలిగొండ (విజయక్రాంతి): మండలంలోని వెలువర్తి గ్రామానికి చెందిన ఎడవల్లి కిష్టయ్య గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. కాగా మృతుడి కుటుంబానికి ఏజెఆర్ ఫౌండేషన్(AJR Foundation) స్థాపకుడు ఎలిమినేటి జంగారెడ్డి 5,000 రూపాయలు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నారమళ్ళ ఉప్పలయ్య, చెవ్వ వెంకటేష్, బూడిది పాపయ్య, మల్లెం నరేష్, నాగలి యాదయ్య, బూడిద నరసింహ, బూడిద సుఖేందర్, ఎడవల్లి నరేష్, ఎడవల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.