15 June, 2026 | 7:26 PM

Breaking News

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •  

ఓట్లు ఎట్ల అడుగుతరు?

11-01-2026 01:16 AM
  1. మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కాంగ్రెస్‌కి బుద్ధి చెప్పడం ఖాయం
  2. రెండేళ్లుగా పట్టణాలను సంక్షోభంలోకి నెట్టింది 
  3. ఖమ్మం, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పార్టీ శ్రేణులతో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ సమావేశం 

హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): రానున్న పురపాలక ఎన్నికల్లో ప్రజ లు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెబుతారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నా రు. పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా కాంగ్రె స్ పార్టీపైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని రెండు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఏ పట్టణానికి చెల్లించని ఏకైక ప్రభుత్వంగా చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచి పోతుందన్నారు. కాంగ్రెస్ రెండు సంవత్సరా ల పాలనలో పట్టణాల్లో పరిపాలన పూర్తి గా పడకేసిందని, పారిశుద్ధ్యం నుంచి మొదలుకొని ప్రతి అంశంలో పట్టణ ప్రజలు తీవ్ర మైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

గత ప్రభుత్వం కేటాయించిన అభివృ ద్ధి కార్యక్రమాలకు మరోసారి శిలాఫలకాలు వేయడం తప్పించి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పని ఒకటి లేదన్నారు. గత ప్రభు త్వం ప్రారంభించిన అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులు, రోడ్లు, కమ్యూనిటీ హాల్, మోడల్ మార్కెట్ల వంటి ప్రతి కార్యక్రమానికి నిధులు ఆపివేయడంతో అన్ని కార్యక్రమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు గ్రామీ ణ ఆర్థిక వ్యవస్థను, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడు తూ, మరోవైపు పట్టణాలను పడుకోబెట్టి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందన్నారు.

ఈ రెండు సంవత్సరాల్లో ఆయా పట్టణాలకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను, ఇచ్చిన నిధులను వివరించి ఓట్లు అడగాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు కేటీఆర్ సవాల్ చేశారు. మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే క్రమంలో భాగంగా శనివారం నిజామాబాద్, ఖమ్మం జిల్లా నేతలతో కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. పురపాలక ఎన్నికలకు సం బంధించిన వివిధ అంశాల పైన దిశా నిర్దేశం చేశారు. మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ తరఫున చేసుకోవాల్సిన ఏర్పాట్లను, ప్రజల ముందు ఉంచాల్సిన వివిధ అంశాలను కేటీఆర్ ఈ సందర్భంగా పార్టీ నేతలకు తెలియజేశారు.

రెండు జిల్లాలకు సంబంధించిన ప్రతి మున్సిపాలిటీలోని క్షేత్రస్థాయి పరిస్థితులపైన క్షుణ్ణంగా సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకా లను అధికార దుర్వినియోగాన్ని తట్టుకొని మంచి ఫలితాలు సాధించామని ఇదే స్ఫూ ర్తితో మున్సిపల్ ఎన్నికల్లోను మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు పార్టీ సీనియర్ నాయకులు హాజరైన ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేత శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు కూడా పలు అంశాలపైన నేతలకు దిశానిర్దేశం చేశారు.

కలిసికట్టుగా సమిష్టిగా కొట్లాడి ఎన్నికల్లో మంచి విజయం నమోదు చేయాలని హరీశ్‌రావు అన్నారు. ఈ సందర్భంగా పురపాలక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూ హంపైన పలు అంశాలను హరీశ్‌రావు నేతలకు వివరించారు. ఈ సమావేశాల సంద ర్భంగా ఆయా జిల్లాల నేతలు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను పార్టీ సీనియర్ నేతలకు వివరించారు. ప్రభుత్వం పైన క్షేత్రస్థాయిలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదని, పార్టీకి అనుకూల వాతావరణ ఉన్నదని తెలిపారు.