2 September, 2026 | 9:35 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

ఈ కాంతదెంతటి భాగ్యమో!

27-05-2025 | 12:07am

ముద్దుగుమ్మలంతా తెలుగు తెరకు పరిచయమయ్యే తరుణం కోసం తపిస్తుంటారు. ఇక్కడ హీరోయిన్‌గా క్లిక్ అయితే చాలు.. ఇక తిరుగుండదనేది బ్యూటీల భావన. కథానాయికలు ఒకప్పుడు టాలీవుడ్లో క్లిక్ అయిపోయి.. బాలీవుడ్లో జెండా పాతాలని కలలు కనేవారు. ఇప్పుడు టైమ్ మారింది. అంతా రివర్స్ అయింది. బాలీవుడ్ నుంచి వచ్చి మరీ టాలీవుడ్లో జెండా పాతేందుకు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ కూడా ఇలాగే తపించి తన కలను నిజం చేసుకుంది.

ఆ ముద్దుగుమ్మకు ప్రస్తుతం టాలీవుడ్లో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఆ చిన్నది మరెవరో కాదు.. మరాఠా మగువ భాగ్యశ్రీ బోర్సే. ఈ అమ్మడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్కి ట్రాన్స్పోర్ట్ అయ్యింది. అందరిలాగే ఈమె కూడా తొలుత బాలీవుడ్లో ఒక సినిమా చేసి డైరెక్టర్ హరీశ్ శంకర్ కంట పడి టాలీవుడ్కి వచ్చింది.

ఆ తర్వాత అమ్మడి ఫేటే మారిపోయింది. తెలుగులో ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. భాగ్య ఖాతాలో విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’.. రామ్ హీరోగా రూపొందుతున్న ‘ఆంధ్రా కింగ్’.. దుల్కర్ సల్మాన్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కాంత’ ప్రాజెక్టులు ఉన్నాయి.

‘కాంత’ తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. ఈ మూడు సినిమాలతో భాగ్యశ్రీ ప్రేక్షకులకు మరింత దగ్గర కానుంది. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇలా ఈ అమ్మడికి ఇప్పుడు బీభత్సమైన డిమాండ్ ఉంది.