చదువుకొనేదెలా..?
మూడేళ్లుగా నిలిచిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్
ట్యూషన్ ఫీజులు చెల్లించలేక విద్యార్థుల కుటుంబాల్లో ఆవేదన
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 3 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వచ్చే ఫీజురీయెంబార్సిమెంట్, స్కాలర్‌షిప్స్ సాయం ఆగిపో యింది. మూడేళ్లుగా ఫీజురీయెంబార్సిమెంట్(ఆర్‌టీఎఫ్) కోసం కాలేజీల యాజమా న్యాలు, స్కాలర్‌షిప్స్(ఎంటీఎఫ్) కోసం విద్యార్థులు పడిగాపులు కాస్తున్నారు.
సాధారణంగా ఒక విద్యాసంవత్సరం పూర్తి కాగానే ఆ సంవత్సరానికి సంబంధించిన, ఫీజురీయెంబార్సిమెంట్, స్కాలర్‌షిప్స్‌ను యాజ మాన్యాలు, విద్యార్థుల (ఖాతా)అకౌంట్లలో ప్రభుత్వం జమ చేస్తుంది. కానీ ప్రభుత్వం ఇవ్వాల్సిన స్కాలర్‌షిప్స్, ఫీజురీయెంబార్సిమెంట్ మూడేళ్లుగా సరిగా రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు.
ప్రభుత్వం నుంచి రావలసిన ట్యూషన్ ఫీజు రాకపోవడంతో హైదరాబాద్ జిల్లాలో ని దాదాపు 550 జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు సహా పలు వృత్తి విద్యా కాలేజీలలో కోర్సులు చదివే విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించడానికి, ఉద్యోగాలలో చేరడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీజురీయెంబార్సిమెంట్ రాకపోవడంతో పలు యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పలు యూనివర్సిటీలు, ప్రభుత్వ కాలేజీలలోనూ ఇదే పద్దతిని అవలంభిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
పైచదు వులు, ఉపాధి కోసం సర్టిఫికెట్లు కావలసిన వారు చేసేదేమీ లేక పలువురు విద్యార్థులు ఆయా కాలేజీలకు ప్రభుత్వం నుంచి రావలసిన ఫీజురీయెంబార్సిటెంట్ రాకపోవడంతో ట్యూషన్ ఫీజు కోసం సొంత డబ్బులు చెల్లిం చి సర్టిఫికెట్లను పొందుతున్నారు. ఫీజు రీయెంబార్సిమెంట్ విషయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయొద్దని గతంలో ప్రభుత్వం చెప్పినా పలు యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు.
ప్రభుత్వం నుంచి రీయెంబార్సిమెంట్ వచ్చినా విద్యార్థుల నుంచి పలు కాలేజీలు వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇవ్వడంలేదనే ఆరోపణలున్నాయి. దీంతో విద్యార్థులు ఆర్థికంగా నష్ట పోతున్నారు. కాగా విద్యార్థులకు రావలసిన స్కాలర్‌షిప్స్ కూడా రాకపోవడం వల్ల కాలే జీ అటాచ్డ్ హాస్టళ్లలో ఉండే విద్యార్థులతో పాటు, డేస్కాలర్ పేద విద్యార్థులు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
బకాయిలు ఇలా..
హైదరాబాద్ జిల్లాలో 2021-22, 2022-23, 2023-24 విద్యాసంవత్సారాలకు గాను 2,99,664 మంది విద్యార్థుల దరఖాస్తులకు గాను ఫీజురీయెంబర్సిమెంట్ దాదాపు రూ.423.79కోట్లు, స్కాలర్‌షిప్స్ 175.66కోట్లు అవసరం ఉంది. అయితే మూడేళ్లలో ఫీజురీయెంబర్సిమెంట్ రూ. 93.1కోట్లు, స్కాలర్‌షిప్స్ రూ.69.31కోట్లు మాత్రమే ప్రభుత్వం నుంచి వివిధ శాఖల ద్వారా విద్యార్థుల అకౌంట్లలోకి చేరింది. ఇంకా రూ.330.72కోట్ల ఫీజురీయెంబార్సిమెంట్, 106.35కోట్ల స్కాలర్‌షిప్స్ విద్యార్థు లకు చేరాల్సి ఉంది.
ఫీజురీయెంబార్సిమెం ట్, స్కాలర్‌షిప్స్ బకాయిలు రాకపోవడంతో విద్యాసంస్థల యాజమాన్యాలు, కాలేజీ అటాచ్డ్ హాస్టళ్లను నిర్వహించే వార్డెన్లు లబోదిబోమంటున్నారు. అయితే ఇప్పటికే వివిధ శాఖలలో విద్యార్థుల సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయిందని, ప్రభుత్వం విడుదల చేయడమే ఆలస్యమని తెలుస్తోంది. గత ప్రభు త్వంలో నిధుల కొరత, విద్యార్థుల కోసం కేటాయింనిన నిధులను ఇతర అవసరాలకు మల్లించడం ద్వారానే ఫీజురీయెంబార్సిమెం ట్, స్కాలర్‌షిప్స్ బకాయిలు పెరిగిపోయాయని పలువురు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా బకాయిలు విడుదల అవుతాయని ఎదురు చూస్తున్నారు.
పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి
గత ప్రభుత్వం ఫీజురీయెంబార్సిమెంట్, స్కాలర్‌షిప్స్ బకాయిలను విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేసింది. పెండింగ్‌లో ఉన్న బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి. డిగ్రీలు పూర్తి చేసి ఉన్నత చదువులకు పోయే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు బకాయిలతో సంబంధం లేకుండా సర్టిఫికెట్లను ఇవ్వాలి.
ఏ లెనిన్, ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్, జిల్లా అధ్యక్షుడు
విద్యార్థులు, యాజమాన్యాలకు ఇబ్బందులు
ఫీజురీయెంబార్సిమెంట్, స్కాలర్‌షిప్స్ రాక విద్యార్థులు, యాజమాన్యా లు ఇబ్బందులు పడుతున్నారు. ఫీజురీయెంబార్సిమెంట్, స్కాలర్‌షిప్స్ విడుద ల కాకపోవడంతో జూనియర్ కాలేజీలతో పాటు డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మ సీ, సహా పలు ప్రొఫెషనల్ కాలేజీల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం వెంట నే బకాయిలను విడుదల చేసి ఆదుకోవాలి. సంక్షేమ పథకాలతో పాటు విద్యార్థుల కోసం కూడా నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలి.
డా.ఎస్ శ్రవణ్‌కుమార్,
ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్
జిల్లా అధ్యక్షుడు, హైదరాబాద్
పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల ఆర్‌టీఎఫ్, ఎంటీఎఫ్ వివరాలు రూ. కోట్లలో..
విద్యాసంవత్సరం దరఖాస్తులు మొత్తం మొత్తం విడుదలైన విడుదలైన పెండింగ్ పెండింగ్
ఆర్‌టీఎఫ్ ఎంటీఎఫ్ ఆర్‌టీఎఫ్ ఎంటీఎఫ్ ఆర్‌టీఎఫ్ ఎంటీఎఫ్
2021 1,01,888 142.43 52.97 75.71 41.71 66.74 11.26
2022 1,00,680 144.32 58.77 16.26 17.71 128.07 41.06
2023 97,096 137.04 63.92 1.13 9.89 135.91 54.03
మొత్తం 2,99,664 423.79 175.66 93.1 69.31 330.72 106.35






