1 April, 2026 | 4:57 PM

మెట్ పల్లిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం

01-04-2026 03:22 PM

మెట్ పల్లి,(విజయక్రాంతి): మెట్‌పల్లి పట్టణంలోని సాయిరామ్ నగర్ కాలనీ యూపీహెచ్‌సీ లో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బుధవారం మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, నాలుగవ వార్డు కౌన్సిలర్ పందిరి రమేష్ లు ప్రారంభించారు. ఈ కార్యక్రమం మండల వైద్యాధికారి డా.ఎల్లాల అంజిత్ రెడ్డి సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం 14వ పుట్టినరోజు పూర్తిచేసుకొని 15వ పుట్టినరోజు రాకముందు ఉన్న బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇవ్వడం అత్యంత ముఖ్యమని తెలిపారు.

ఈ వ్యాక్సిన్ గర్భాశయ ముఖ క్యాన్సర్ ను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ కుమార్తెలకు 15 సంవత్సరాలు పూర్తయ్యే ముందు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.