13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

జిహెచ్‌ఎంసి పరిధిలోని 8 కి.మీ మేర 24 శాతం హెచ్‌ఆర్‌ఏ అమలు చేయాలి

26-03-2026 01:34 AM

రంగారెడ్డి, మార్చి 25( విజయక్రాంతి): విస్తరించిన జీహెచ్‌ఎంసీ పరిధికి చుట్టుపక్కల 8 కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 24 శాతం ఇంటి అద్దె భత్యం వెంటనే అమలు చేయాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీజీవో) అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు రామారావు, కార్యదర్శి శ్రీనేష్ కుమార్ నోరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బుధవారం కొంగరకలాన్లోని ఐడీఓసీ లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో తీసుకున్న తీర్మానం ప్రతిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తరపున డీఆర్‌ఓ సంగీతకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీఓ ఎంఎస్ నెం. 53 ప్రకారం ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని త్వరగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమం లో నూతనకంటి వెంక ట్, అలివేలు, సైదమ్మ, రాకేష్, పావని, ఉమ, బాలేశ్వరి తదితరులు పాల్గొన్నారు.