26 March, 2026 | 3:13 AM

పోచారంలో పోలీసుల నాకా బందీ

26-03-2026 01:36 AM

ఘట్ కేసర్, మార్చి 25 (విజయక్రాంతి): పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అధికారుల ఆదేశానుసారం, ఉప్పల్ జోన్ డీసీపీ కె. సురేష్ కుమార్ పర్యవేక్షణలో, మేడిపల్లి ఏసీపీ బి. మోహన్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి (నాకాబందీ) తనిఖీలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పోచారం ఐటీసీ ఇన్స్పెక్టర్ రాజు వర్మతో పా టు ఘట్కేసర్ డీఐ జె. శ్రీనివాస్, 9 మంది ఎస్త్స్రలు, డివిజన్ ఫోర్స్ 20 మంది, ఏఆర్ ఫోర్స్ 19 మంది, ముగ్గురు ట్రాఫిక్ పోలీసు లు పాల్గొన్నారు.ఈ తనిఖీ లు రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు రెండు ప్రాంతాల్లో ’నాకా బందీ’ వాహన తనిఖీలు నిర్వహించడం జరిగింది.అన్నోజిగూడ బ్రిడ్జి అండర్ పాస్, వెంకటాపూర్ స్వాగత ద్వారం వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. మొత్తం 747 వానాలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 12 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.