calender_icon.png 3 February, 2026 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18 శాతానికి సుంకం

03-02-2026 01:41:40 AM

  1. ప్రతీకార వస్తు సుంకాన్ని తగ్గించాం
  2. భారత్ అమెరికా మధ్య 500 బిలియన్ డాలర్ల వాణిజ్యానికి అంగీకారం
  3. రష్యా నుంచి భారత్ ఇక చమురు కొనుగోలు చేయదు: ట్రంప్
  4. భారతీయుల తరఫున ట్రంప్‌కు కృతజ్ఞతలు: ప్రధాని మోదీ 
  5. రష్యా చమురు కొనుగోలు అంశంపై స్పష్టత ఇవ్వని భారత ప్రభుత్వం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ‘రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుంది. అమెరికా, వెనిజులా నుంచి చమురు కొంటామని భారత ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. మోదీ నా ప్రియమైన స్నేహితుడు. నేను ఆయనతో ఫోన్‌లో సంభాషించాను. మోదీ హామీ ఇవ్వడంతో మేం భారత్‌పై విధిస్తున్న ప్రతీకార వస్తు సుంకాన్ని25% నుంచి 18%కి తగ్గిస్తున్నాం.

రెండు దేశాల మధ్య దాదాపు 500 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యా నికి అంగీకారం జరిగింది’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ తన సొంత సోషల్‌మీడియా ‘ట్రూత్’ ద్వారా ప్రకటించారు. ‘భారత్ ప్రధాని మోదీతో మాట్లాడటం సంతోషాన్నిచ్చింది. నా గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరు.

మేమిద్దరం రష్యా- యుద్ధం ముగింపు గురించి సంభాషించాం. రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపివేసి, అమెరికా, వెనిజులా నుంచి కొంటామని హామీ ఇచాచరు. ఈ నిర్ణయం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించడానికి సహాయపడుతుంది. భారత్‌తో మా అనుబంధం భవిష్యత్‌లో మరింత బలోపేతం అవుతుంది’ అని పేర్కొన్నారు.

ఇదే అంశంపై అమెరికా రాయబారి సెర్గియో గోర్ స్పష్టతనిచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సంభాషించారని ధ్రువీకరించారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలోనే ట్రంప్ శుభవార్త చెప్పడం శుభపరిణామమని, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో జైశంకర్ భేటీ కానుండటం శుభసూచకమని భారత ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే.. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో ఇప్పటివరకు భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ట్రంప్‌తో సంభాషణ అద్భుతం: ప్రధాని మోదీ

ఈ రోజు నేను నా ప్రియమిత్రుడు, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌తో సంభాషించాను. ఆ సంభాషణ అద్భుతంగా సాగింది. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న ప్రతీకార ఎగుమతి సుంకాలను ఆయన 25శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం ఆనందాన్నిచ్చింది.

అంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు 140 కోట్ల మంది భారతీయుల తరఫున ట్రంప్‌కు నా కృతజ్ఞతలు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు తీసుకునే నిర్ణయాలు రెండు వైపులా మేలు చేస్తాయి. ట్రంప్‌తో కలిసి సన్నిహితంగా పనిచేయడానికి నేనెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా