హిందూ సమ్మేళనం ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీ
17-04-2026 09:00 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): శ్రీ రాజరాజేశ్వర స్వామి హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు , 18న జరుగు హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య వక్తగా దావులూరి మురళి విభాగ్ వ్యవస్థ ప్రముఖ ప్రారంభించారు, ఇందులో పెద్ద ఎత్తున హిందూ సమ్మేళన సమితి సభ్యులు పాల్గొన్నారు.






