17 April, 2026 | 10:25 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా టీబీ పరీక్ష శిబిరం

17-04-2026 08:56 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని వెంకట్రాంపురం గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గరిడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో టీబి పరీక్షల శిబిరాన్ని ఆ గ్రామ సర్పంచ్ కీసర వెంకటరమణ బుచ్చిబాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... క్షయ వ్యాధిగ్రస్తులు డాక్టర్లు ఇచ్చే సలహాలను పాటించి క్షయ వ్యాధిపట్ల జాగ్రత్తలు పాటించాలన్నారు. అనంతరం వైద్యాధికారి నరేష్ మాట్లాడుతూ... భారతదేశాన్ని టీవీ రహిత  దేశంగా మార్చే లక్ష్యం వేగవంతం చేయడంలో భాగంగా నిర్వహించే 100 రోజుల కార్యక్రమం అన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా క్షయ వ్యాధి నిర్ధారణ కొరకు స్కూటం పరీక్షలు,ఎక్స్రే పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. టీబీ వ్యాధి నిర్ధారణ అయినట్లయితే అటువంటి వ్యక్తులకు టీవీ మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. కాగా ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ నరేష్ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు పోస్ట్ ఆఫీస్ ఫీల్డ్ అసిస్టెంట్లు రేషన్ డీలర్ల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.