24 July, 2026 | 11:27 AM

తిరుమలగిరిలో భార్యాభర్తలు ఆత్మహత్య

24-07-2026 10:54 AM

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో వడియాల శ్రీనివాస్, భార్య జ్యోతిలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన విరాల ప్రకారం.. తిరుమలగిరి పట్టణ కేంద్రానికి చెందిన వడియాల శ్రీనివాస్(58), భార్య జ్యోతిలు(52) వ్యాపారం చేస్తూ జీవనోపాధి సాగిస్తున్నారు. అకస్మాత్తుగా శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడగా, శుక్రవారం ఉదయం ఇంటిలో ఇరువురు మృతి చెందారు. జరిగిన సంఘటన ధారాళంగా వ్యాపించడంతో, పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది గల కారణాలను పోలీసులు విచారణ చేస్తున్నట్టు సమాచారం.