24 July, 2026 | 11:28 AM

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం

24-07-2026 10:50 AM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ( Rahul Gandhi arrest),మల్లికార్జున కార్గి, ప్రియాంక గాంధీల అరెస్టులకు నిరసనగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.నీట్ పరీక్షలో లీకులకు కారణమైన కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి వెంటనే కేంద్ర విద్యా శాఖ మంత్రినీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే బాధ్యత వహించి రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటు ముందు మార్చి నిర్వహించిన విద్యార్థులకు మద్దతు పలకడం కోసం వచ్చిన రాహుల్ గాంధీనీ అరెస్టు చేయడం బాధాకరమన్నారు.కేంద్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారంలో పూర్తిగా విప్లమవుతుందని విమర్శించారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలు పరిష్కరించకుండా నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు గుడ్డి వెంకనీ ప్రభాకర్,సీనియర్ నాయకులు వాసు రెడ్డి, మురళి గౌడ్,దివిటి కిష్టయ్య,పర్వతారావు, వస్రం నాయక్,మునిగేపల్లి సంగయ్య,సాయ గౌడ్,మన్నే వెంకటి,శ్రీరాం గౌడ్,గంపల వెంకన్న, కిరణ్,ఆరిఫ్,సతీష్,దత్తు, హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు.