24 July, 2026 | 11:22 AM

ఈనెల చివరి వరకు కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలి: ఏపీడి విజయలక్ష్మి

24-07-2026 10:51 AM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని సమాఖ్య కార్యాలయంలో వివోఏలతో ఏపిడి విజయలక్ష్మి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ డి విజయలక్ష్మి మాట్లాడుతూ... ఈనెల చివరి వరకు కొత్త సంఘాలు వృద్ధుల మహిళా సంఘాలు,దివ్యాంగుల మహిళా సంఘాలు మరియు కిషోర్ బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలని సూచించారు.శ్రీనిధి రికవరీ గురించి వివోఏలు, సీసీలు రికవరీ విషయంలో పకడబందిగా పనిచేస్తూ రికవరీ శాతాన్ని పెంచుతూ, శ్రీనిధి డిస్టిబూరస్మెంట్ కూడా చేయాలని తెలిపారు.బ్యాంకు లీకేజ్ కూడా అన్ని గ్రామ సంఘాలు ఏనెలకు,ఆనెల 100% అచీవ్మెంట్ చేయాలని తెలుపడం జరిగింది.అలాగే ఎస్ఈఆర్ పి కార్యక్రమాలపై ప్రతి వివోఏకి టార్గెట్స్ అచీవ్మెంట్ అడగడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏపీడి విజయలక్ష్మి,మండల సమైక్య అధ్యక్షురాలు శాంతమ్మ, ఎస్ఎన్.ఆర్ఎం కిరణ్,ఏపీఎం దత్తు,సీసీలు నజీర్,రవి,సావిత్రి,ఎస్ఎన్ మేనేజర్ అమల, అకౌంటెంట్ రాజు,ఆపరేటర్ రవి తదితరులు ఉన్నారు.