24 July, 2026 | 11:18 AM

హెచ్‌పీవీ టీకాపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

24-07-2026 10:48 AM

నాగిరెడ్డిపేట,(వుదయం): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను డిఎంహెచ్ఓ వెంకటి సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందితో సమావేశమై ఆరోగ్య సేవల అమలుపై సమీక్ష నిర్వహించారు.ప్రభుత్వ ప్రసవాల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని,అంటువ్యాధులు కాని దీర్ఘకాలిక వ్యాధుల (ఎన్‌సీడీ) స్క్రీనింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.అలాగే అర్హులైన బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో నర్సింగ్ చౌహాన్,మండల ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి సృజన్ కుమార్,ప్రోగ్రామ్ ఆఫీసర్ వెంకటస్వామి,సూపర్వైజర్లు,ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు,ఆశాలు కార్యకర్తలు పాల్గొన్నారు.