13 August, 2026 | 2:47 AM

మోతెలో భార్యాభర్తల హత్య

13-08-2026 12:27 AM
  1. మట్టిలో మృతదేహాల పూడ్చివేత
  2. సూర్యాపేట జిల్లాలో దారుణం

మోతె, ఆగస్టు 12 (విజయక్రాంతి) : భార్యాభర్తలను హత్యచేసి వారిని సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్ర సమీపంలో మట్టిలో పూడ్చిపెట్టిన ఘటన కలకలం సృష్టిస్తుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోతె మండలం బీక్యా తండాకు చెందిన హలావత్ నాగు, బూబాలు భార్యాభర్తలు పొట్టకూటి కోసం మోతె మండల కేంద్రానికి వచ్చి కొంత భూమిని కౌలుకు తీసుకొని సేద్యం చేసుకుంటూ రెండేళ్లుగా అక్కడే నివశిస్తున్నట్లు తెలిపారు.

మంగళవారం రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తల మీద గట్టిగా కొట్టి వారిని హత్య చేసి ఇక్కడికి తీసుకువచ్చి పాతిపెట్టిన ఆనవాళ్లు ఉన్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. బుధవారం ఉదయాన్నే అటుగా వెళ్తున్న రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మునగాల సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో డీఎస్పీ పర్యవేక్షణలో సంఘటన స్థలాన్ని చేరుకొని ఆనవాళ్లు గుర్తించారు.

పాతిపెట్టిన మృతదే హాలు బయటకు తీసిన తర్వాత అక్కడ ఉన్న తండాకు చెందిన వాసులు తమ తండావాసు లుగా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీస్ లు కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు చెస్తున్నారు. అయితే వీరిని ఎవరు, ఎందుకు హత్య చేశారనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.