calender_icon.png 15 July, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్య మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న భర్త

14-07-2025 10:57:20 PM

ఏటూరునాగారం (విజయక్రాంతి): నిత్యం మద్యం సేవిస్తున్న భర్తను ఎందుకు మద్యం తాగుతున్నావు అని భార్య మందలించడంతో మనస్తాపానికి గురైన భర్త, మద్యం మత్తులో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని శంకరాజుపల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకరాజుపల్లి గ్రామానికి చెందిన తాటి కృష్ణంరాజు కొన్ని నెలలుగా మద్యం తాగడం అలవాటు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన భార్య తాటి ఆదిలక్ష్మి ఎందుకు మద్యం తాగుతున్నావు అని పలుమార్లు మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన కృష్ణంరాజు మద్యం మత్తులో క్షణికావేశానికిలోనై సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే కృష్ణంరాజు మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. మృతుడి భార్య తాటి ఆదిలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.