17 April, 2026 | 8:28 PM

Breaking News

ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •   ఎర్రకుంట స్మశాన వాటికలో చెట్ల తొలగింపు   •  

భార్య లేని జీవితం భరించలేక భర్త ఆత్మహత్య

25-06-2025 10:03 AM

చేవెళ్ల: భార్య లేని భరించలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం(Moinabad Mandal) మేడిపల్లి గ్రామానికి సాలె రమేశ్(35), పుష్పలత(32) దంపతులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవారు.  నాలుగు రోజుల కింద(21న) అనారోగ్య కారణాలతో భార్య మృతి చెందింది.  దీంతో రమేశ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.  ఆదివారం రోజు ఉదయం ఎప్పటిలాగే స్నానం చేసి బట్టలు వేసుకునేందుకు ఇంట్లోకి వెళ్లాడు.

ఎంతకూ బయటికి రాకపోవడంతో అతని తండ్రి సాలె యాదయ్య వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో కింద పడి నోట్లో నుంచి నురగలు రావడం గమనించాడు. పక్కనే చూడగా పురుగులు మందు డబ్బా కనిపించింది. దీంతో మందు తాగాడని నిర్ధారించుకొని స్థానికుల సాయంతో వెంటనే మొయినాబాద్ మున్సిపల్(Moinabad Municipal) పరిధిలోని భాస్కర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం చనిపోయాడు. మృతుడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు