17 April, 2026 | 10:09 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డెన్ సెర్చ్

25-06-2025 10:25 AM

మహబూబాబాద్, (విజయక్రాంతి): శాంతి భద్రతల(Peace and security) పరిరక్షణలో భాగంగా  మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశానుసారం బయ్యారం మండలం రామచంద్రాపురంలో కార్డన్ సెర్చ్(Cordon and search) నిర్వహించినట్టు ఎస్ ఐ కొగిళ్ళ తిరుపతి తెలిపారు. ఈ సందర్భంగా  అక్రమంగా నిల్వచేసిన 7 వేల రూపాయల విలువైన మద్యం,   5వేల రూపాయల విలువైన గుట్కా పాకెట్స్, 10 లీటర్ల గుడుంబా, 500 లీటర్లు బెల్లం పానకం పట్టుకొని నలుగురి పైన కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అలాగే సరైన ధృవ పత్రాలు లేని 20 వాహనాలను సీజ్ చేశారు. గ్రామస్థులకు ట్రాఫిక్ రూల్స్, సైబర్ క్రైమ్స్ గురించి గ్రామస్థులకు అవగాహన కల్పించి, ప్రభుత్వ నిషేధిత గుడుంబా, గంజాయి, గుట్కా, నల్ల బెల్లం, గేమింగ్ దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఐ పుల్లారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.