calender_icon.png 19 December, 2025 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికతో పెళ్లి.. భర్తకు జీవితఖైదు

19-12-2025 02:50:16 PM

హైదరాబాద్: బలవంతంగా బాలికతో పెళ్లి, అత్యాచారం కేసులో భర్తకు జీవితకాలం జైలుశిక్ష పడింది. 2018లో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 17 ఏళ్ల బాలికకు బలవంతంగా పెళ్లి చేశారు. పెళ్లి పెద్దగా వ్యవహరించిన బాలిక తండ్రికి జీవిత ఖైదు పడింది. రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు(Rangareddy District POCSO Court) బాలిక భర్త, తండ్రికి రూ. 75 వేల చొప్పున జరిమానా విధించింది. న్యాయమూర్తి బాధితురాలికి రూ. 15 లక్షల పరిహారం మంజూరు చేశారు.