7 April, 2026 | 2:19 AM

భార్యను హత్య చేసిన భర్త

07-04-2026 12:00 AM
  1. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో ఘటన

జహీరాబాద్, ఏప్రిల్ 6(విజయక్రాంతి): భార్య గొంతుకోసి హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికందిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం జహీరాబాద్ పట్టణంలోని వెంకటరమణ కాలనీలో నివాసం ఉంటున్న మాలిపట్లోల సిద్ధారెడ్డి భార్య కవిత(29) గత నెల 27న ఇంట్లో నుండి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది.ఇంట్లో నుంచి మూడు లక్షల రూపాయలు తీసుకొని వెళ్లి పోయిందని గత నెల 30న సిద్ధారెడ్డి జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

జడ్చర్ల నుండి తీసుకువచ్చేందుకు వెళ్లారు. అలాగే సిద్దారెడ్డి సైతం పోలీసులతో పాటు వెళ్లాడు. కాగా సదాశివపేట మండలం నందికంది జాతీయ రహదారిపై ఒక్కసారిగా సిద్ధారెడ్డి కవితపై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వివాహేతర సంబంధమే కవిత హత్యకు కారణమని తెలిసింది. ఎస్‌ఐ వినయ్ కుమార్ హత్య చేసిన సిద్ధారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.