02-11-2025 12:00:00 AM
వనపర్తి టౌన్, నవంబర్ 1: వివాహేతర సంబంధం మోజులో భర్తను ప్రియుడితో కలిసి కడతేర్చింది ఓ భార్య. ఈ ఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్‌లో నివా సం ఉంటున్న కురుమూర్తి.. జిల్లా కేంద్రంలోని ఓ మాల్‌లో వాచ్ మెన్‌గా పనిచేస్తు న్నాడు. కురుమూర్తి మూడు రోజులుగా కనిపించడం లేదని అతడి సోదరి చెన్నమ్మ అక్టోబర్ 28న పోలీసులకు ఫిర్యాదు చేసిం ది.
వనపర్తి పట్టణ రెండో ఎస్సై శశిధర్ కేసు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. కురుమూర్తి భార్య నాగమణి మెట్టు పల్లికి చెందిన నందిమల్ల శ్రీకాంత్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమం లోనే వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ఇద్దరు కుట్రపన్ని కురుమూర్తిని హత్య చేశారు.
అనంతరం సెల్ప్ డ్రైవింగ్ పేరిట వనపర్తిలో కారు అద్దె కు తీసుకొని శ్రీశై లం వెళ్లి డ్యాంలో కురుమూర్తి మృతదేహం పడేశారు. కురుమూర్తి సోదరి చెన్నమ్మ ఫిర్యాదుతో నాగ మణి, శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య ఉదంతo బయటపడింది. కురుమూర్తి మృతదేహం కోసం నిందితులిద్దరిని శ్రీశైలం డ్యాం వద్దకు తీసుకెళ్లి పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది.