16 March, 2026 | 3:35 AM

భార్యను హత్య చేసిన భర్త

01-12-2025 01:59 AM

వికారాబాద్ జిల్లాలో దారుణం

తాండూరు, నవంబర్ 30 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన పెద్దేముల్ తండాలో దారుణం జరిగింది. తండా కు చెందిన మూడవత్ రవి, అనిత(28) భార్య భర్తలు. వీరికి 15 సంవత్సరాల క్రితం వివాహం అయింది. ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. అయితే గత కొన్ని రోజుల క్రితం రవి మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుండి వెళ్లిపోయాడు.

ఎలాగోలా అతనిని కుటుంబ సభ్యులు తిరిగి ఇటీవలే తీసు కువచ్చి చికిత్స చేయించారు. అయితే ఆదివారం భార్య భర్తల మధ్య వాగ్వాదం జరిగిం ది. కోపోద్రిక్తుడైన రవి పారాతో అనితపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన అనిత అక్కడికక్కడే మృతి చెందింది.