25 May, 2026 | 9:36 AM

బాలమల్లు సేవలు మరువలేనివి

17-06-2024 12:25 AM

హుస్నాబాద్, జూన్ 16: సీపీఐ బలోపేతానికి వేల్పుల బాలమల్లు అందించిన సేవ లు మరువలేనివని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. కొహెడ మండలం నాగసముద్రాలకు చెందిన పార్టీ నేత బాలరాజు ఇటీవల మరణించాడు. ఆదివారం కుటుంబ సభ్యులు గ్రామంలో దశదినకర్మ నిర్వహించంగా, ఈ కార్యక్రమానికి వెంకటరెడ్డి హాజరయ్యారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు.