ఢిల్లీకి పంత్..లక్నోకు కుల్దీప్
- ఐపీఎల్‌లో మరో భారీ ట్రేడ్ డీల్
- రూ.12 కోట్లు తగ్గించుకున్న పంత్
ముంబై, జూన్ 23 : ఐపీఎల్-లో ఢిల్లీ క్యా పిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య భారీ ట్రేడ్ డీల్ జరిగింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ రెండేళ్ల తర్వాత మళ్లీ తన పాత ఫ్రాంచైజీకి ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి తి రిగి వచ్చేశాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జాయింట్స్ జట్టులోకి వెళ్తున్నాడు. పంత్ తన ధరను రూ.12 కోట్లు తగ్గించుకుని రూ.15 కోట్లకే ఢిల్లీకి వెళ్లిపోయాడు. ఐపీఎల్ -2025 మెగా వేలంలో పం త్‌ను రూ.27 కోట్ల రికార్డు ధరకు లక్నో కొనుగోలు చేసి కెప్టెన్సీ బా ధ్యతలు అప్పగించింది.
అయితే అతడు మాత్రం లక్నో యాజమాన్యం అంచనాలను అందుకోలేకపోయాడు. వరుసగా రెండు సీ జన్లలోనూ లక్నో కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేక పట్టికలో ఆఖరి స్ధానాలకు పరిమిత మైంది. పంత్ వ్యక్తిగత ప్రదర్శ న కూడా పేలవంగా సాగింది. దీంతో మేనేజ్‌మెంట్‌తో విభేదాలు తలెత్తి సీజన్ ముగియగానే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. 2016 నుంచి 2024 వరకు రిషభ్ పంత్ ఢిల్లీ ఫ్రాంచైజీకే ప్రాతినిథ్యం వహించామరోవైపు ఢిల్లీ క్యాపి టల్స్ తో తన ఐదేళ్ల బంధానికి కుల్దీప్ వీడ్కోలు పలికాడు.






