19 May, 2026 | 6:45 PM

Breaking News

తంగళ్లపల్లి మండలంలో తహసీల్దార్, ఎంపీడీవో పోస్టులు భర్తీ చేయాలి   •   విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగినప్పుడే ఉన్నత స్థానాలకు చేరుకుంటారు   •   సింగరేణి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన యువతకు ఉద్యోగ అవకాశాలు   •   పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు కృషి చేయాలి   •   కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలు సాధించాలి   •   విద్యుత్ సరఫరా అంతరాయం   •   సుందరయ్య జీవితం స్ఫూర్తిదాయకం   •   ఎట్టకేలకు బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మల్లెపూల సత్యనారాయణ నియామకం   •   ఇంధన ధరల పెంపుతో సామాన్య ప్రజలపై అదనపు భారం   •   మైనార్టీ గురుకుల కళాశాలలో ఎంపీసీ, బైపీసీకి అడ్మిషన్ ప్రారంభం   •  

రాష్ట్రంలో మరో ఎమ్మెల్సీ ఎన్నిక

25-03-2025 12:50 AM
  1. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాకు షెడ్యూల్ విడుదల
  2. 28న నోటిఫికేషన్.. ఏప్రిల్ 23న పోలింగ్  
  3. 25న ఫలితాలు 

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): తెలంగాణలో మరో ఎన్నిక నగారా మోగింది. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. మే 1తో ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్‌రావు పదవీ కాలం ముగియనుంది. ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈ నెల 28న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

ఏప్రిల్ 23న పోలింగ్, 25న ఫలితాలు లెక్కింపు ఉంటుదని ఈసీ పేర్కొంది. హైదరాబాద్ జిల్లాలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నట్టు ఈసీ వెల్లడించింది. అయితే ఈ ఎమ్మెల్సీ స్థానం ఎవరికి దక్కబోతున్నదని ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 స్థానాలకు గానూ మూడు కాంగ్రెస్, ఒక స్థానంలో సీపీఐ, మరో స్థానంలో బీఆర్‌ఎస్ విజయం సాధించాయి.

అయితే ఆ సమయంలో తమకు ఒక సీటు కేటాయించాలని ఎంఐఎం పార్టీ కాంగ్రెస్‌ను కోరింది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీకి మద్దతు ఇస్తామని కాంగ్రెస్‌తో అవగాహనకు వచ్చినట్టు వార్తలు విపించాయి.