ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
దక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ మణికొండ వేదకుమార్
ముషీరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్య త అని దక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్, బాలారణ్య(సంప్రదాయ వ్యవసాయ క్షేత్రం)వ్యవస్థాపకులు మణికొండ వేదకుమార్ అన్నారు. ఎర్త్ డే సందర్భంగా బాలారణ్య నేచర్ సెంటర్లో పర్యావరణ పరిరక్షణ పట్ల తన అంకితభావాన్ని వ్యక్తం చేశారని బాలారణ్య క్షేత్ర ప్రతినిధి తలారి స్వామి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గాలి, నీరు, భూమి వంటి సహజ వనరులను కాపాడటం మన కర్తవ్యం అని, ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి, దాన్ని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు పచ్చని వారసత్వాన్ని అందించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ క్షేత్రంలో పెంచుతున్న చెట్లను ప్రేమతో కౌగిలించుకుని, వాటితో సంభాషిస్తూ ప్రకృతిపై తన ఆప్యాయతను వ్యక్తం చేశారని, అలాగే చెట్లతో పాటు పశువులు, జంతువులతో కూడా అనుబంధాన్ని పెం పొందిస్తూ, వాటికి అవసరమైన ఆహారాన్ని అందించి జీవరాశుల పట్ల ప్రేమను ప్రతిఫలింపజేశారని తెలిపారు.
ఆవులు, గుర్రాలు, వాటి పిల్లలతో మమేకమై జీవించడం ద్వా రా ’ప్రకృతి-మానవ’ సంబంధాన్ని మరిం త బలపరిచారని చెప్పారు. ఎర్త్ డే కార్యక్రమంలో భాగంగా, వ్యవసాయ కూలీలతో క లిసి అనేక రకాల మొక్కలను నాటారని తెలిపారు. వ్యవసాయ క్షేత్రంలో వినియోగిం చిన ప్లాస్టిక్ కవర్లను సేకరించి, వాటిని శాస్త్రీయం గా పారవేయడం ద్వారా భూమి కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టారు.






