1 April, 2026 | 8:22 PM

మంథనిలో రన్ ఫర్ జీసస్ ను విజయవంతం చేయండి

01-04-2026 06:12 PM

 మంథనిలో ఎంసిపిఎఫ్ ప్రెసిడెంట్ ఐతు డేవిడ్

మంథని,(విజయక్రాంతి) మంథని పట్టణంలో రన్ ఫర్ జీసస్ ను విజయవంతం చేయాలని మంథని  ఎంసిపిఎఫ్ ప్రెసిడెంట్ ఐతు డేవిడ్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఈనెల 4 తేది శనివారం ఉదయం 7 గంటల కు ప్రారంభమై  మంథని మున్సిపాలిటీ పరిధిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు నుండి శ్రీపాద చౌకు అంబేద్కర్ విగ్రహం మీదుగా బస్ డిపో నుండి ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల మీదుగా ఎస్బిఐ బ్యాంకు నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించే రన్ ఫర్ జీసస్ కార్యక్రమం విజయవంతం చేయాలని డేవిడ్ కోరారు. అనంతరం బేతేల్ గాస్పల్ ప్రేయర్ మినిస్ట్రీస్ ఎరుకల గూడెం ఆవరణంలో ఉచిత మెడికల్ హెల్త్ క్యాంపు నిర్వహించబడునని, ఈ  హెల్త్ క్యాంపులో మందులు ఉచితంగా ఇవ్వబడునని, ఈ అవకాశాన్ని మంథని నియోజకవర్గ  ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని కోరారు.