కేజ్రీవాల్ కు మూడు రోజులు సీబీఐ రిమాండ్
న్యూఢిల్లీ : లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు మూడ్రోజుల సీబీఐ రిమాండ్ విధించింది. తిహార్ జైలులో ఉన్న ఆయనను బుధవారం సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఢిల్లీ మధ్య పాలసీ కేసులో కీలక విషయాలను వెలవరించిన సీబీఐ మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరులు పిటిషన్ వేసింది.
ఎక్సైజ్ పాలసీని త్వరగా తయారు చేయాలని అడిషనల్ సెక్రెటరీని కేజ్రీవాల్ ఆదేశించినట్లు సీబీఐ స్పష్టం చేసింది. ఎక్సైజ్ పాలసీ తయారవుతూన్న సమయంలోనే సౌత్ గ్రూప్ నుంచి కేజ్రీవాల్ ను కాంటాక్టు చేశారని పేర్కొంది. దీంతో కేజ్రీవాల్ ను ఐదు రోజులు కస్టడీకి సీబీఐ అధికారులు కోరగా మూడ్రోజులు ఇచ్చేందుకు ఢిల్లీ రౌస్ అరెన్యూ కోర్టు అనుమతినిచ్చింది. తదుపరి విచారణ జూన్ 29వ తేదీకి వాయిదా వేసింది.






