calender_icon.png 2 May, 2025 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ హోర్డింగ్స్‌పై హైడ్రా దూకుడు

24-04-2025 01:07:04 AM

కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి):ఎలాంటి అనుమతి లేకుండా నిర్మించిన అక్రమ హోర్డింగ్స్ ను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ లో అనుమతి లేకుండా నిర్మించిన భారీ హోర్డింగ్స్ ను భారీ క్రేన్ తో హైడ్రా అధికారులు తొలగించారు.

కొంపల్లి మున్సిపాలిటీ లో నాలుగు అనుమతి లేని భారీ హోర్డింగ్స్ ను గుర్తించిన హైడ్రా అధికారులు దూలపల్లి లో ఒకటి కూల్చివేయగా బుధవారం కొంపల్లి లోని పాలం మిడోస్ దగ్గర ఒకటి అలాగే దూలపల్లి స్టేట్ బ్యాంక్ ఎదురుగా నిర్మించిన మరో భారీ హోర్డింగ్స్ గ్యాస్ కట్టర్స్,భారీ క్రేన్ సహాయంతో తొలగించారు.దూలపల్లి ప్రధాన రహదారితోపాటు, పాలం మిడోస్ ప్రాంతాలు నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాలు కావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు.