24-04-2025 01:05:24 AM
కార్మికుల ఐక్యతతో మేడేను జయప్రదం చేయండి
అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 23: అమరుల స్ఫూర్తితో కార్మిక హక్కులను సాధిం చుకోవాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు డీ.కిషన్ అన్నారు. మే డే సం దర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో గోడ పత్రికను తుర్కయంజాల్ అంబేద్కర్ చౌరస్తాలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రంగారెడ్డి నాయకులు డి. కిషన్, చంద్రమోహన్ మాట్లాడుతూ... అమరుల స్ఫూర్తితో కార్మిక హక్కులను సాధించుకోవాలని కార్మికులు పిలుపునిచ్చారు.
కార్మిక వర్గం కోసం పోరాడి సాధంచుకున్న ఎనిమిది గంటల పని విధాన్ని వారాంతపు సెలవులను కాపాడుకోవాలని.. అదేవిధంగా 44 కార్మిక చట్టాలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి.. వాటి స్థానంలో తీసుకోస్తున్న నలుగు లేబర్ కోడ్‌లు కార్పొరేట్, పెట్టుబడిదారులకు, పరిశ్రమల యాజమాన్యలకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఉన్నాయి. కార్మికులను కట్టు బానిసలు మార్చేందకేనని..
కానుక నలుగు లేబర్ కోడ్‌లను ఉపసంహరించునేంత వరకు కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు. నేడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రూ.26 వేలు చట్టబద్దమైన సౌకర్యాలు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. మే డే పురస్కరించుకోని ఘనంగా ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎం.సత్యనారాయణ, బి మాల్యాద్రి, పీ శ్రీనివాసులు, ఐ కృష్ణ, ఏ మాధవరెడ్డి, జంగయ్య, రాములు, ఆటో డ్రైవర్స్ నాయకులు జక్కా హనుమంత్ రెడ్డి, బాలరాజ్, బీరప్ప, రాజు, మధుకర్ రెడ్డి, యాదగిరి, రామకృష్ణారెడ్డి, దేవేందర్ రెడ్డి, నాగరాజు, వినోద్, కార్మిక నాయకులు మేతరి దాసు, రవీందర్, యాదయ్య, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.