calender_icon.png 1 May, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుజురాబాద్‌లో పెరిగిన కౌశిక్ అరాచకాలు

24-04-2025 01:08:34 AM

హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఓడితల ప్రణవ్ బాబు.

హుజురాబాద్, ఏప్రిల్23 (విజయక్రాంతి): హుజరాబాద్‌లో పెరిగిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి  అరాచకాలు,పదవి అడ్డుపెట్టుకొని భారీఎత్తున వసూల్‌కి  పాల్పడుతు న్నాడని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణబ్ బాబు ఆరోపించారు.

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు సభ్య సమాజంలో ప్రజలకు అవసరమయ్యే పనులు చేయాలి కానీ పదవిని అడ్డుపెట్టుకొని వ్యాపారస్తులను, ఇతర వర్గాలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం సబబు కాదని అన్నారు.

కమలాపూర్ మండలం వంగపల్లి-గుండేడ్ గ్రామ సరిహద్దులో ఉన్నటువంటి గ్రానైట్ వ్యాపారి కట్టా మనోజ్ రెడ్డి దగ్గర హుజురాబాద్ ఎమ్మెల్యే డబ్బులు వసూలు చేశాడని సాక్షాత్తు వాళ్ళ భార్య రమాదేవి సుబేదారి పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తు ఇవ్వడం,అదీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ప్రతినిధిపై మహిళ దరఖాస్తు ఇవ్వడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని,కౌశిక్ రెడ్డి చర్యలవల్ల ఇప్పటికే హుజురాబాద్ పరువు దిగజారుతుందని ఇలాంటి చర్యల ద్వారా మరింత దిగజార్చుతున్నాడని అన్నారు.

గతంలో కూడా అనేకమందిని బెదిరించి ఇబ్బందులకు గురిచేసాడని ఇలాంటి ఎమ్మెల్యేలు ఎందుకు గెలిపించుకున్నామని హుజురాబాద్ ప్రజలు అంతర్మదనంలో పడ్డారని అన్నారు. ఎమ్మెల్సీగా, ఎమ్మేల్యేగా కౌశిక్ రెడ్డి విఫలమ య్యాడని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి, కమలాపూర్ మార్కేట్ చైర్మెన్ ఝాన్సీ-రవీందర్, హుజురాబాద్ పట్టణ,మండల అధ్యక్షులు తిరుపతి, కిరణ్,హనుమాన్ దేవాలయ చైర్మెన్ శంకర్, హుజురాబాద్ మండల, పట్టణ మహిళా అధ్యక్షురాలు పుష్పలత, రాధ, నాగమణి, వంశీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.