18-09-2025 12:00:00 AM
మండిపడుతున్న హిందూ ధార్మిక సంస్థలు
శేరిలింగంపల్లి,సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): హైదరాబాద్ భాగ్యనగరంలో హైడ్రా మళ్ళీ కొరడా ఝుళిపించింది తాజా గా మియాపూర్ డైనమిక్ కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గోశాలను బుధ వారం ఉదయం హైడ్రా సిబ్బంది కూల్చివేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆలయానికి ఆనుకొని కాలనీవాసులు ఏర్పాటు చేసిన గోశాలను ఎమినిటీస్ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని అధికారు లు చెబుతున్నారు.
అయితే, హైడ్రా చర్యలను పలు హిందూ ధార్మిక సంస్థలు తీవ్రం గా ఖండించాయి. ఓవైసీ సోదరులు చెరువు నడిబొడ్డున కళాశాలలు నిర్మించుకున్నా బీరాలు పలకని హైడ్రా కమిషనర్, గోమాతలు ఆశ్రయం పొందుతున్న గోశాలను కూల్చడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుం డా నేరుగా కూల్చివేయడం అమానుషమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేవాలయం పక్కన ఉన్న గోశాలను ఎందుకు కూలుస్తారు రోడ్డుపైకి తోసిన గోమాతల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గోమాతలకు సంబంధించిన ఆశ్రయాల విషయంలో హైడ్రా పునరాలోచించుకోవాలని, మతపరమైన భావాలను దెబ్బతీయకుండా చూసుకోవాలని హిందూ ధార్మిక సంస్థలు డిమాండ్ చేశాయి.