ఉన్నత విద్యారంగ అక్రమాలపై చర్యలు తీసుకోవాలి
క్వాలిఫైడ్ గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్స్ అసోసియేషన్ డిమాండ్
ముషీరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): ఉన్నత విద్యారంగంలో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని క్వాలిఫైడ్ గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్స్ అసోసియేషన్ (క్యూజిడీఎల్‌ఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ముఖ్యంగా కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలకు చెందిన కె. సురేందర్ రెడ్డి వ్యవహారంపై విచారణ జరిపించాలని సంఘం కోరింది.
ఈ మేరకు గురువారం సంఘం అ ధ్యక్షుడు డాక్టర్ టి.ఎస్. ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి. బాలయ్య మా ట్లాడుతూ డిగ్రీ కళాశాల సర్వీసు నిబంధనలు, సీనియారిటీ, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. జీ ఓ 21/2026 ద్వారా జూనియర్ లెక్చరర్ల సర్వీసును డిగ్రీ కళాశాల సీఏఎస్ ప్రయోజనాలకు పరిగణనలోకి తీసుకోవడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.
కె. సురేందర్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని, ఆయనకు సహకరిస్తున్న కళాశాల విద్యా కమిషనరేట్ అధికారులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డిగ్రీ కళాశాల సర్వీసులకు సంబంధించిన అంశాల్లో ఆయన ప్రాతినిధ్యం వహించకుండా నిషేధించాలన్నారు. సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చి. రాజు, కోశాధికారి డాక్టర్ ఆర్. రత్న మంజుల, సంయుక్త కార్యదర్శి ఆర్.హెచ్. ఆర్థర్ తదితరులు మాట్లాడుతూ ఉన్నత విద్యారంగంలో నిబంధనల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.






