14 August, 2026 | 10:54 AM

‘హైనా’ హల్‌చల్

25-05-2024 01:12 AM

హైనా దాడిలో 2 దూడలు మృతి

భయానికి గురవుతున్న రైతులు

సిద్దిపేట రూరల్, మే 24 (విజయక్రాంతి) : సిద్దిపేట జిల్లాలో ‘హైనా’ హల్ చల్ చేస్తుంది. గొర్రెలు దుర్ఘటన మరువక ముందే అదే గ్రామంలో గురువారం రాత్రి రెండు దూడలను గాయపరిచి ప్రాణం తీసింది. గ్రామానికి చెందిన బాధి త రైతులు రేగుల రాజయ్య, ఎదుల్ల మో హన్‌రెడ్డి కథనం మేరకు.. రోజువారీగా వ్యవసాయ పొలం వద్ద పశువుల కొట్టం లో పశువులను కట్టేసి వచ్చాము. శుక్రవారం ఉదయం కొట్టం దగ్గరకు వెళ్లగా కట్టేసి ఉన్న దూడలు గాయపడి ఉన్నట్టు తెలిపారు. సమాచారం తెలుసుకున్న గ్రామ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ ఘటన జరిగిన వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన గొర్రెల మృతి, వెంటనే మరుసటి రాత్రి రెండు దూడలను ప్రాణం పోవడంతో రైతులు భయానికి గురవుతున్నారు. ఆయా దుర్ఘటనల పరిశీలించిన జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విక్రమోద్దీన్ ఆధ్వర్యంలో సెక్షన్ ఆఫీసర్ బుచ్చయ్య, బీట్ ఆఫీసర్ శ్రీకాంత్ క్షేత్రస్థాయిలో కార్యచరణ చేపట్టారు. హైనా తిరుగుతున్న ప్రాం తాలను గుర్తించేందుకు సీసీ కెమెరాలను, దాన్ని బందించేందుకు బోనును ఏర్పా టు చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బుచ్చయ్య

గొర్రెలపై దాడి సంఘటనలో దాడి చేసిన జంతువును గుర్తించి పట్టుకోకముందే మరోక ఘటన జరుగడం చాలా బాధాకరం. గ్రామంలోని రైతులతో పాటు పరిసర ప్రాంత గ్రామాల రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపా రు. రైతులు ఆందోళన చెందవద్దని, పశువుల, గొర్రెల కొట్టాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎక్కడైనా అలాంటి అనుమానాలు కలిగితే తమకు సమాచారం అందించాలన్నారు.