విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్ మృతి
అందోల్, మే 24 : ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌తో జూనియర్ లైన్‌మెన్ మృతి చెందిన సంఘటన మండలంలోని మల్లికార్జున పల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డికి చెందిన బాల్‌రాజు(24) నాలుగు నెలల క్రితం మండలం లోని మల్లికార్జున పల్లి గ్రామానికి జూనియర్ లైన్‌మెన్‌గా నియామకమయ్యాడు. అప్పటి నుంచి మల్లికార్జునపల్లిలో జూనియర్ లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం మల్లికార్జునపల్లి గ్రామ శివారులోని ఓ రైతు వ్యవసాయ పొలంలో విద్యుత్ స్తంభం పైకి ఎక్కి విద్యుత్ తీగలు సరి చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా కావడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, విద్యుత్ శాఖ అధికారు లు, పోలీసులు సంఘటన స్థలానికి చెరుకో ని ప్రమాదానికి గల కారణాలు తెలుసు కున్నారు. అనంతరం విద్యుత్ శాఖ అధికా రులు ఉన్నత అధికారులతో మాట్లాడి మృతి చెందిన జూనియర్ లైన్‌మెన్ కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం, విద్యుత్ శాఖ తరుపున రూ. 10లక్షలు అందిస్తామని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం సదాశివపేట ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు సమాచారం. కుటుంబ సభ్యు ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






