04-05-2025 12:00:00 AM
ఈ పక్షిని ’గ్రేటర్ బర్డ్ ఆఫ్ ప్యారడైజ్‘ అని పిలుస్తారు. ఇది ఇండోనేషియా, గునియా వంటి దేశాల్లో కనిపిస్తుంది. ఇవి మొత్తం 39 రకాలు ఉన్నాయి. వాటిలో అతి పెద్ద పక్షి ఇది. అలాగే అందమైన పక్షి కూడా.. ఇదే కావడం విశేషం. దీని శరీరం బ్రౌన్ రంగులో ఉంటుంది. తల పైభాగం గోధుమ, నలుపు.. కింది భాగం ఆకుపచ్చ రంగు కొలతలతో వేసినట్లుగా కనిపిస్తుంది. ముక్కేమో.. పర్పుల్ రంగులో చాలా బాగుంటుంది.
ఈ పక్షిని చూడగానే బొమ్మను చూసిన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే దీని ఆకారం అలా ఉంటుంది. తోక గుబురుగా.. మొదట్లో పసుపు.. తర్వాత తెలుపు.. ఆ తర్వాత బూడిద రంగులో కనువిందు చేస్తుంది. ఇది చిన్నచిన్న గుంపులతో ఉండటానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంది. పండ్లు, విత్తనాలు, అప్పుడప్పుడు చిన్న చిన్న కీటకాలను తిని.. కడుపు నింపుకుంటుంది. ఇంకో విషయం.. ’లెగ్ లెస్ బర్డ్ ఆఫ్ ప్యారడైజ్‘ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే.. ఈ పక్షి కి వేళ్లు ఉంటాయి. కానీ పాదాలు ఉండవు.
చూడటానికి ఈ పక్షి చాలా సుకుమారంగా కనిపిస్తుంది. చిన్న దెబ్బలను కూడా తట్టుకోలేదు. మరో విశేషం ఏమిటంటే.. ఈ పక్షి పుట్టిన తర్వాత ఒక్కసారి కూడా ఈకలు నేలను తాకవు. చనిపోయిన తర్వాత మాత్రమే.. నేలను తాకుతాయి. ఎప్పుడూ చెట్ల మీదే ఉంటుంది. లేకపోతే ఎంచక్కా గాల్లో ఎగురుతుంది. ఈ పక్షి పొడవు 35 నుంచి 43 సెంటీ మీటర్లు ఉంటుంది. సాధారణంగా అయితే అయిదేళ్లు.. కొంచెం జాగ్రత్తగా జీవిస్తే.. 30 సంవత్సరాల వరకు జీవిస్తాను. ఇవి ఈ పక్షి విశేషాలు..